Disclaimer   
News Super Search
 ♦ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  
Full Site Search
  Search  
 
Sat May 27, 2017 00:29:37 ISTHomeTrainsΣChainsAtlasPNRForumGalleryNewsFAQTripsLoginFeedback
Sat May 27, 2017 00:29:37 IST
Advanced Search
Trains in the News    Stations in the News   
Page#    2550 news entries  <<prev  next>>
  
Feb 18 2017 (22:50)  రైల్వేజోన్‌తో ఏపీకి ఏం లాభం? పాత్రికేయులకు రైల్వే అధికారుల ప్రశ్న (www.eenadu.net)
back to top
Rail BudgetECoR/East Coast  -  

News Entry# 294253     
   Tags   Past Edits
This is a new feature showing past edits to this News Post.

Posted by: Ravichandra Madagala~  82 news posts
దిల్లీ: రైల్వే జోన్‌ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఏం ఉపయోగమో చెప్పాలని రైల్వే అధికారులు విలేకర్లను ప్రశ్నించారు. 2017-18 రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించిన ప్రాజెక్టులపై వివరించడానికి శుక్రవారం ఇక్కడ పాత్రికేయులతో సమావేశమైన అధికారులు రైల్వే జోన్‌ గురించి అడిగినప్పుడు పైవిధంగా ప్రశ్నించారు. ‘‘ప్రత్యేక రైల్వే జోన్‌ డిమాండ్‌ అంశం మాకు తెలుసు. రైల్వేబోర్డులోని ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ దానిపై పనిచేస్తోంది. అన్ని కోణాల్లో అది అధ్యయనం చేస్తోంది’’ అని చెబుతూనే దానివల్ల రాష్ట్రానికి ఎలా లాభం జరుగుతుందో చెప్పాలని కోరారు. జోన్‌ ఉన్నా లేకపోకపోయినా బడ్జెట్‌లో అన్ని ప్రాంతాలకు అవసరాలకు తగ్గట్టు కేటాయింపులు జరుపుతారని పేర్కొన్నారు. ఏ డివిజన్‌ నుంచి వచ్చే నిధులు ఆ డివిజన్‌ వద్దే ఉండవని, సంఘటిత నిధికి చేరుతాయని వ్యాఖ్యానించారు.
భద్రాచలం-కొవ్వూరు లైన్‌ నిర్మాణానికి భూసేకరణ పూర్తికాలేదని అధికారులు తెలిపారు. రూ.1,500 కోట్ల విలువైన ప్రాజెక్టుకు రెండేళ్లలో రూ.17 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు భూసేకరణ పూర్తిచేసి ఇస్తే నిధులు కేటాయిస్తామన్నారు.
సంయుక్త
...
more...
భాగస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అయిదు ప్రాజెక్టులు కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ధారించినట్లు అధికారులు చెప్పారు. తెలంగాణలో బోధన్‌-బీదర్‌, సికింద్రాబాద్‌-జహిరాబాద్‌ వయా సంగారెడ్డి ప్రాజెక్టులు ఉన్నట్లు వెల్లడించారు.
  
Feb 17 2017 (22:51)  విశాఖ జోన్‌పై వింత మాట! (www.andhrajyothy.com)
back to top
Rail BudgetSCR/South Central  -  

News Entry# 294208     
   Tags   Past Edits
This is a new feature showing past edits to this News Post.

Posted by: Ravichandra Madagala~  82 news posts
‘విశాఖకు రైల్వే జోన్‌’ అన్నది దశాబ్దాలుగా ఉన్న డిమాండ్‌. అయితే, దీనిపై రైల్వే ఉన్నతాధికారులు వింతగా స్పందించారు. ‘‘కొత్త జోన్ వల్ల ఏపీకి ఉపయోగం ఏమిటి? జోన్ ఏర్పడితే అక్కడ వచ్చే ఆదాయమంతా దాని పరిధిలోనే ఖర్చవుతుందనే అపోహ ఉన్నట్లుంది. దేశంలో ఏ జోన్ కు ఎంత ఆదాయం వచ్చినా అది మొత్తం రైల్వే శాఖ ఖాతాలోనే జమవుతుంది. ఆయా జోన్ల ప్రాధాన్యాలను బట్టి నిధులను కేటాయించి ఖర్చు చేస్తుంటాం’ అని పేర్కొన్నారు. అయినప్పటికీ... రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు, ముగ్గురు రైల్వే బోర్డు అధికారులతో కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతోందని వారు వెల్లడించారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, కొత్త జోన్ ఏర్పాటు అంశం పరిశీలనలోనే ఉందని తెలిపారు. విశాఖ రైల్వేలో ఇతర రాష్ట్రా‌ల ప్రభావం, పెత్తనం గురించి స్పందిస్తూ.. ‘‘జోన్ ఉన్నతాధికారులంతా జాతీయ స్థాయి వారే. వారికి ప్రాంతీయ భావనలేమీ ఉండవు. అలాంటప్పుడు వేరే రాష్ట్ర పెత్తనం ఎక్కడుంటుంది?’’ అని ప్రశ్నించారు.
  
Feb 17 2017 (22:49)  ఏపీకి ఆరు కొత్త రైళ్లు! (www.andhrajyothy.com)
back to top
Rail BudgetSCR/South Central  -  

News Entry# 294206   Blog Entry# 2168795     
   Tags   Past Edits
This is a new feature showing past edits to this News Post.

Posted by: Ravichandra Madagala~  82 news posts
మార్చి-ఏప్రిల్‌లో ప్రారంభిస్తాం.. ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు నాన్‌ ఏసీ బోగీలు
ప్రయాణ సమయం తగ్గిస్తాం.. ఏపీలో 50951.61 కోట్ల ప్రాజెక్టులు
యూపీఏతో పోల్చితే భారీగా కేటాయింపులు
రైల్వే శాఖ ఉన్నతాధికారుల వెల్లడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఆరు
...
more...
కొత్త రైళ్లను మార్చి-ఏప్రిల్‌ నెలల్లో ప్రవేశపెడతామని రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం-విజయవాడ మధ్య ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు, తిరుపతి-జమ్మూ తావి, భువనేశ్వర్‌-కృష్ణరాజపురం, హౌరా-యశ్వంతపూర్‌, కామాఖ్య-బెంగళూరు మధ్య హమ్‌సఫర్‌, సంత్రాగచ్చి-చెన్నై మధ్య అంత్యోదయ రైళ్లకు పచ్చ జెండా ఊపుతామన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రైల్వేకు జరిగిన కేటాయింపులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా‌లకు ఇచ్చిన నిధులపై శుక్రవారం ఢిల్లీలో రైల్వే ఉన్నతాధికారులు మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో వాల్తేరు, విజయవాడ రైల్వే స్టేషన్లను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని... దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పారు. న్యూఢిల్లీ-విశాఖపట్నం మధ్య నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌ ఏసీ రైలుకు ఇకపై నాన్-ఏసీ బోగీలను కూడా జత చేస్తామని అధికారులు తెలిపారు. ఈ రైల్లో ప్రయాణికుల సంఖ్య 23-25 శాతం వరకే ఉంటోందని, దీన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మొత్తంగా ప్రయాణ సమయం తగ్గేలా చర్యలు చేపడుతున్నామని, నెల రోజుల్లోనే మార్పులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.

భారీగా పెరిగిన నిధులు
యూపీఏ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే నిధుల కేటాయింపు 284 శాతం పెరిగినట్లు అధికారులు చెప్పారు. ‘‘ప్రస్తుతం ఏపీలో రూ.41,809 కోట్ల పనులు జరుగుతున్నాయి. రూ.3367.42 కోట్ల కొత్త ప్రాజెక్టులను గతేడాది చేపట్టాం. ఈ ఏడాది కొత్త ప్రాజెక్టులకు రూ.5775.19 కోట్లు కేటాయించాం. మొత్తంగా ఏపీలో రూ.50951.61 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు చేపట్టాం. ప్రయాణికుల సౌకర్యాల కల్పనకు ఈ ఏడాది రూ.71 కోట్లు కేటాయించాం. ఈ ఏడాది రాష్ట్రంలో ఏడు కొత్త సర్వేలు, ఒక కొత్త లైను నిర్మాణానికి అనుమతులు ఇచ్చాం. 19 కొత్త ఆర్వోబీలు, ఆర్‌యూబీలను చేపట్టనున్నామని వివరించారు.

తెలంగాణతో అమరావతి అనుసంధానం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తెలంగాణ రాష్ట్రంతో అనుసంధానిస్తామని అధికారులు తెలిపారు. విజయవాడ-గుంటూరు వయా అమరావతి నూతన రైల్వే లైను నిర్మించేందుకు ఈ ఏడాది గ్రీన సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. 106 కిలోమీటర్ల పొడవైన ఈ లైను నిర్మాణానికి రూ.2679.59 కోట్ల అంచనా వ్యయాన్ని రైల్వేశాఖ ప్రతిపాదించింది. వాస్తవానికి విజయవాడ-అమరావతి మధ్య దూరం 50 కిలోమీటర్ల లోపే ఉంటుందని, అయితే సర్వేలో త్రికోణాకృతి కలిగిన లైను నిర్మాణం 106 కిలోమీటర్లు వచ్చిందని రైల్వే శాఖ తెలిపింది. ఈ లైను కొంత మేరకు తెలంగాణలో కూడా ఉంటుందని వివరణ ఇచ్చింది. తద్వారా అమరావతి తెలంగాణతో అనుసంధానం కానుంది.

1 posts - Fri Feb 17, 2017 - are hidden. Click to open.

6 posts - Sat Feb 18, 2017 - are hidden. Click to open.

  
806 views
Feb 21 2017 (19:04)
tired f waitng4d PR SCRs train gets LHB rake~   1822 blog posts   36 correct pred (67% accurate)
Re# 2168795-8            Tags   Past Edits
masala manchi gumagumalaade vasana vastundi ga .. okka nellalone ee maarpulu antaa. - last lo kotimeera kuda vesadu :D

  
795 views
Feb 21 2017 (19:06)
12752   1244 blog posts   5 correct pred (89% accurate)
Re# 2168795-9            Tags   Past Edits
kakpotey anni vesadu gani uppu veyatam marchipoyadu.....mothaniki padipoyindi vantakam :P
  
Feb 17 2017 (22:48)  విజయవాడ - గూడూరు మధ్య మరో లైను (www.andhrajyothy.com)
back to top
Rail BudgetSCR/South Central  -  

News Entry# 294205     
   Tags   Past Edits
This is a new feature showing past edits to this News Post.

Posted by: Ravichandra Madagala~  82 news posts
రాజధాని ప్రాంతానికి పెరగనున్న రైళ్ల కనెక్టివిటీ
ఆధునికీకరణ జాబితాలో తెనాలి రైల్వే జంక్షన్
మూడో రైల్వే లైనుతో మహర్దశ
దేశంలోనే అత్యంత కీలకమైన హౌరా-చెన్నై రైలు మార్గంలో మూడో లైను ఏర్పడనుంది. విజయవాడ - గూడూరు, విజయవాడ - దువ్వాడ మధ్య మూడో లైను ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. మూడో లైన్‌ ఏర్పాటైతే ఈ మార్గంలోని తెనాలి జంక్షన్‌ కీలకం కానుంది. ఈ మార్గంలో రైళ్ల రాకపోకల స్వరూపం మారిపోనుంది.
గుంటూరు,
...
more...
తెనాలి : నవ్యాంధ్ర రాజధాని ఈ ప్రాంతంలో రావడంతో రాజధానికి అనుసంధానంగా కొత్త రైల్వే లైన్లు, రైళ్ల కనెక్టివిటీ పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా హౌరా - చెన్నై ప్రధాన రైలు మార్గంలో విజయవాడ- గూడూరు మధ్య మూడో లైను ఏర్పాటు చేయనున్నారు. గతంలోనే ఈ ప్రతిపాదన ఉంది. ఈ మార్గంలో రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని సరుకు రవాణా రైళ్లు, ప్రయాణికుల రైళ్లకు వేర్వేరు లైన్లు ఏర్పాటు చేసి కారిడార్‌గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు పట్టాలు ఎక్కనున్నాయి. నవ్యాంధ్ర రాజధాని ప్రధాన కేంద్రంగా ఉన్న విజయవాడ మీదుగా దువ్వాడ నుంచి గూడూరు వరకు మూడో లైను మంజూరైనట్లు రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రైళ్లు నడిపేందుకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు. మూడో లైన్‌ ఏర్పాటైతే ఈ మార్గంలోని తెనాలి జంక్షన్‌ రైల్వే అభివృద్ధికి కీలకం కానుంది. పలు రైళ్లు తెనాలి మీదుగా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఏర్పడనుంది. దీంతో పాటు తెనాలి రైల్వే స్టేషనను ఆధునికీకరణ జాబితాలో కూడా రైల్వే శాఖ చేర్చింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకల స్వరూపం మారిపోనుంది. రెండు లైన్లతో రద్దీ
ప్రస్తుతం విజయవాడ - గూడూరు మార్గంలో రెండు లైన్లు ఉన్నాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక రైలుతో పాటు గూడ్సు రైళ్లు అధిక సంఖ్యలో ప్రయాణించే ఈ మార్గంలో రద్దీ కారణంగా రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరుగుతుండటంతో భవిష్యత్తులో రైళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రద్దీని తట్టుకోవడానికి వీలుగా మూడో లైను ఏర్పాటు అవసరమని భావిసున్నారు. తెనాలి -విజయవాడ - గుంటూరును కలుపుతూ రాజధాని మీదుగా భవిష్యత్తులో కొత్త రైల్వే లైన్లు రానున్నాయి. రాజధానిని కలుపుతూ ఈ నగరాల మధ్య రైళ్ల కనెక్టివిటీ పెంచాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం తెనాలి - గుంటూరు - విజయవాడ మధ్య సర్క్యులర్‌ రైళ్లు నడుస్తున్నాయి.
తెనాలి - గుంటూరు మధ్య డబ్లింగ్‌
తెనాలి - గుంటూరు మధ్య డబ్లింగ్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో వైపు రాజధాని అమరావతి మీదుగా గుంటూరు, విజయవాడల మధ్య కొత్త లైన ఏర్పడనుంది. తెనాలి మీదుగా ఉన్న హౌరా- చెన్నై ప్రధాన రైలు మార్గాన్ని రాజధాని ప్రాంతంతో అనుసంధానం చేస్తే పెరిగే ప్రయాణ అవసరాలకు తగిన విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భవిష్యతలో ఈ మార్గంలో హై స్పీడ్‌ రైళ్లతో పాటు బుల్లెట్‌ ట్రైన్లను నడిపే ప్రతిపాదనను రైల్వే పరిశీలిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఆయా మార్గాలను అభివృద్ధి చేయనున్నారు.
  
Feb 17 2017 (22:47)  గుంటూరు రైల్వే డివిజనుకు ప్రాధాన్యం పెంచాలి: ఎంపీ రాయపాటి (www.andhrajyothy.com)
back to top
Rail BudgetSCR/South Central  -  

News Entry# 294204     
   Tags   Past Edits
This is a new feature showing past edits to this News Post.

Posted by: Ravichandra Madagala~  82 news posts
గుంటూరు : గుంటూరు డివిజన నుంచి దక్షిణ మధ్య రైల్వేకు పెద్ద మొత్తంలోనే ఆదాయం సమకూ రుతున్నప్పటికీ నూతన రైళ్లు, ప్రత్యేక రైళ్ల ఏర్పాటులో తగినంత ప్రాధాన్యం లభించడం లేదని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు రైల్వే జీఎం దృష్టికి తీసుకొచ్చారు. రైల్వేస్టేషనకు వచ్చిన ఎంపీ రాయపాటి జీఎంతో పలు సమస్యలపై చర్చించారు. అమరా వతి నూతన రాజధాని మార్గాల పనులు త్వరితగతిన గ్రౌండింగ్‌ చేసి పూర్తి చేయాల న్నారు. మాచర్ల - నల్గొండ నూతన రైలుమార్గం కూడా గ్రౌండింగ్‌ చేయాలని కోరారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో తాత్సారం తగదని అక్కడ ఇబ్బంది ఉంటే గుంటూరుని జోన్ గా ప్రకటించాలన్నారు. వినుకొండ, మాచర్లకు డెమూ రైళ్లని నడపాలన్నారు. గుంటూ రు - చెన్నై, గుంటూరు - తిరుపతికి పగటి పూట ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు నడపాలి. విజయవాడ - యర్రగుంట్ల మధ్య ప్యాసింజర్‌ రైలు నడపాలన్నారు. నాగార్జున ఎక్స్‌ప్రెస్‌ని పునరుద్ధరించాలని కోరారు. కొండవీడు, లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లని రెగ్యులర్‌ చేయాలన్నారు. నాగర్‌సోల్‌, భావనగర్‌, భువనేశ్వర్‌, పూరీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలని కోరారు. పిడుగురాళ్ల, వినుకొండ, నరసరావుపేట, పెదకూరపాడు, మంగళగిరి రైల్వేస్టేషన్లలో అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు నిలుపుదల సౌకర్యం కల్పించాలన్నారు.
  
Feb 17 2017 (22:46)  నడికుడి - నల్లగొండ మధ్య నూతన రైల్వే లైను (www.andhrajyothy.com)
back to top
Rail BudgetSCR/South Central  -  

News Entry# 294203     
   Tags   Past Edits
This is a new feature showing past edits to this News Post.

Posted by: Ravichandra Madagala~  82 news posts
పగిడిపల్లి-నల్లపాడు మధ్య విద్యుద్దీకరణకు నిధుల మంజూరు
నడికూడి-శ్రీకాళహస్తి మధ్య ప్రారంభమైన నిర్మాణం పనులు
రైల్వే ప్రయాణికుల భద్రతే లక్ష్యం
సౌత్ సెంట్రల్‌ రైల్వే జీఎం వినోద్‌కుమార్‌
గుంటూరు, దాచేపల్లి : రైల్వే ప్రయాణికులకు భద్రత, నాణ్యమైన సేవలందిం చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సికింద్రాబాద్‌ సౌత్ సెంట్రల్‌ రైల్వే
...
more...
జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. గురువారం వార్షిక పర్య టనలో భాగంగా నడికుడి రైల్వే స్టేషనుకు చేరుకున్నారు. తొలుత సిమెంట్‌ ఫ్యాక్టరీల యాజమాన్యంతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే మార్గం నిర్మాణం పనులు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. నల్లగొండ - మాచర్ల మధ్య నూతన రైల్వే ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారన్నారు. పగడిపల్లి - నల్లపాడు మధ్య డబుల్‌ లైనింగ్‌, విద్యుద్దీకరణకు చర్యలు తీసుకున్నామన్నారు. కేసానుపల్లి రెల్వే గేట్‌ వద్ద అండర్‌ పాస్‌ ఏర్పాటు చేయాలని, తారురోడ్డు నిర్మా ణం చేపట్టాలని, మాచర్ల ప్యాసింజర్‌ రైలుకు బోగీలు పెంచాలని పలక్‌నామా, రాజధాని రైళ్లు నిలపాలని, నడికుడి స్టేషను నుంచి రాకపోకలు సాగిస్తున్న ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లను ఒకటో నెంబర్‌ ఫ్లాట్‌ ఫారంపై నిలపాలని, నడికుడి సర్పంచి బుర్రి విజయ్‌కుమార్‌ రెడ్డి, తంగెళ్ల శ్రీనివాసరావు, జువ్వల సురేష్‌, షేక్‌ జాకీర్‌హుస్సేన, మునగా పున్నారావు వినతి పత్రం అందజేశారు.
పరిశుభ్రత కోసం నగదు అందజేసిన జీఎం వినోద్‌కుమార్‌యాదవ్‌: నడికుడి రైల్వే ఆస్పత్రిలోని పరిశుభ్రత, తీసుకుంటున్న జాగ్రత్తలు, ఆస్పత్రి పరిసరాల్లో పెంచుతున్న మొక్కలు ఇతర అంశాలు జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ను ఆకట్టుకున్నాయి. ఎక్కడా చిన్నపాటి లోపం లేకుండా పరిశుభ్రతకు మారుపేరుగా ఆసపత్రి ఉండటంతో తక్షణమే వైద్యురాలు రాజకుమారికి పదివేల రూపాయలు నగదు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్‌ఎం విజయశర్మ, చీప్‌ ఆపరేషన మేనేజర్‌ ఎన్ మధుసూదనరావు, సీపీఎం పీ గణేష్‌రావు, నడికుడి రైల్వే స్టేషను మాష్టర్‌ నాయక్‌ తదితరులు ఉన్నారు.
  
Feb 16 2017 (08:56)  'Let down' by Centre, activists to intensify stir for suburban trains (www.deccanherald.com)
back to top
Rail BudgetSWR/South Western  -  

News Entry# 294024     
   Tags   Past Edits
This is a new feature showing past edits to this News Post.

Posted by: karbang~  162 news posts
Activists fighting for the suburban railway system will intensify their agitation in the days to come to protest against the non-allocation of funds for the commuter rail project in the Union Budget 2017-18.
The allocation of Rs 3,174 crore to South Western Railway in the latest budget has not brought cheer to the members of Citizens for Bengaluru (CfB), Praja Rag and other associations that have come together to fight against the steel flyover.
“By signing a memorandum of agreement last month, the Railways made a commitment to develop suburban railway. The allocation
...
more...
for track doubling works doesn’t include the long-pending projects like Yeshwantpur-Hosur,” CfB coordinator Srinivas Alavilli said.
Alavilli welcomed the allocation of funds for other projects and said that Bengaluru, which contributes in great measure to the development of the country, deserves “at least what was promised.”
Activists have already started expressing their disappointment on Twitter and Facebook. Sanjeev Dyamannavar of Praja Rag said they will start writing to the MPs representing Bengaluru, seeking funds.
  
Feb 16 2017 (07:00)  అత్యాధునికంగా 36 రైల్వే స్టేషన్ల అభివృద్ధి.. (www.sakshi.com)
back to top
Rail BudgetSCR/South Central  -  

News Entry# 294011     
   Tags   Past Edits
This is a new feature showing past edits to this News Post.

Posted by: Ravichandra Madagala~  82 news posts
సాక్షి, హైదరాబాద్‌: అత్యాధునిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విమానాశ్రయాల తరహాలో దేశవ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్ల పునర్నిర్మాణంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వేలో 36 స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌యాదవ్‌ తెలిపారు. మొదటి దశలో చేపట్టనున్న సికింద్రాబాద్, విజయవాడ రైల్వేస్టేషన్ల రీడెవలప్‌మెంట్‌ విధివిధానాలను ఆయన గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ రెండు స్టేషన్లకు మే 24లోగా గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానిస్తున్నామన్నారు. మొదట ఆయా సంస్థల సాంకేతిక, ఆర్థికసామర్థ్యాలను అనుసరించి డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టును కోరతామని చెప్పారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రూ.282 కోట్లు, విజయవాడ స్టేషన్‌లో రూ.194 కోట్ల మేర ప్రయాణ సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు.
ఇందుకోసం సికింద్రాబాద్‌కు ఆనుకుని ఉన్న 5.6 ఎకరాల స్థలాన్ని, విజయవాడ స్టేషన్‌కు ఆనుకుని ఉన్న 7.87 ఎకరాలను ప్రైవేట్‌ సంస్థల వాణిజ్య కార్యకలాపాల కోసం 45 ఏళ్ల పాటు లీజుకు ఇస్తామని తెలిపారు. ప్లాట్‌ఫామ్‌ల ఆధునీకరణ, అదనపు ప్లాట్‌ఫామ్‌ల ఏర్పాటు, స్టేషన్‌ సుందరీకరణ, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు, మల్టీలెవల్‌ పార్కింగ్, ప్రత్యేక ర్యాంప్‌లు, విశ్రాంతి గదులు, కేటరింగ్, పరిశుభ్రమైన తాగునీరు, ఏటీఎంలు, ఫార్మా, పటిష్టమైన భద్రతా వ్యవస్థ, అన్ని ప్లాట్‌ఫామ్‌లకు
...
more...
ఎస్కలేటర్లు, లిఫ్టులు వంటి అత్యాధునిక ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.
ఇందుకోసం రైల్వేశాఖ సొంతంగా ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా స్థలాలను ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టడం ద్వారా సదుపాయాలను కల్పిస్తుందని వివరించారు. రెండో దశలో దక్షిణ మధ్య రైల్వేలోని మరో 12 ప్రధాన రైల్వేస్టేషన్ల పునర్నిర్మాణానికి వచ్చే జూన్‌లో, మూడో దశలో 22 స్టేషన్లకు డిసెంబర్‌లో టెండర్‌లను ఆహ్వానిస్తామన్నా రు. ఇండియా చాలెంజ్‌ పద్ధతిలో గ్లోబల్‌ టెండర్లకు రైల్వేశాఖ శ్రీకారం చుట్టిందన్నారు.
  
దిల్లీ: ఉబర్‌, ఓలా తదితర క్యాబ్‌ సేవలకు పెరుగుతున్న డిమాండును రైల్వేశాఖ కూడా తన ప్రయోజనానికి ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. దేశంలోని దాదాపు 500 రైల్వేస్టేషన్లలో క్యాబ్‌ సేవలు ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోంది. తద్వారా దాదాపు రూ.300 కోట్ల వార్షికలాభం ఆర్జించే అవకాశం ఉందని లెక్కలు వేసింది. రైల్వేస్టేషన్లలో క్యాబ్‌లు పెట్టడానికి స్థలం కేటాయించడం, ప్రయాణికులు వాటిని బుక్‌ చేసుకోవడానికి కియోస్క్‌లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. క్యాబ్‌ కంపెనీలతో పలుసార్లు జరిగిన చర్చల అనంతరం ఈ మేరకు రైల్వేశాఖ నిర్ణయించిందని ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. పూర్తి విధివిధానాలను రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు వచ్చే నెలలో వెల్లడిస్తారన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న స్టేషన్లలో వాహనాల పార్కింగ్‌ అద్దెల ద్వారా రూ.122 కోట్ల ఆదాయం వస్తోంది. తాజా నిర్ణయంతో ఏటా మరో రూ.200 కోట్లు రావొచ్చని అంచనా.
  
Feb 15 2017 (20:04)  हमीरपुर-ऊना रेलवे लाइन बिछाने के लिए 2850 करोड़ रुपए मिले (himachal.punjabkesari.in)
back to top
Rail BudgetNR/Northern  -  

News Entry# 293976     
   Tags   Past Edits
Feb 15 2017 (20:04)
Station Tag: Una Himachal/UHL added by OM SAI RAM~/1462045

Posted by: OM SAI RAM ਆਦਿਤਯ ਕੁਮਾਰ~  82 news posts
ऊना :हमीरपुर-ऊना रेल लाइन को मिली धनराशि पर हो रही सियासत के बीच बीजेपी सांसद अनुराग ठाकुर ने सफाई दी है। हमीरपुर से सांसद अनुराग ठाकुर ने ऊना में कहा कि हमीरपुर-ऊना रेलवे लाइन बिछाने के लिए 2850 करोड़ रुपए ही मिले हैं। कांग्रेस के नेता जिस 1 करोड़ की बात कह रहे हैं वो सिर्फ रेलवे लाइन बिछाने का सर्वे करने के लिए हैं। रेल लाइन बिछाने के लिए पहले सर्वे ही किया जाता है। जैसे ही रेल लाइन का सर्वे पूरा होगा वैसा ही केंद्र सरकार और पैसा जारी करेगी। मुख्यमंत्री वीरभद्र सिंह पर निशाना साधते हुए अनुराग ने कहा कि बड़े पदों पर रहने के बावजूद ऐसी बयानबाजी उन्हें शोभा नहीं देती।
Page#    2550 news entries  <<prev  next>>

Scroll to Top
Scroll to Bottom


Go to Mobile site