dont know about dat....
*******************
గుంతకల్లు-తిరుపతి రైలు కర్నూలు వరకు
రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి
12/30/2012 1:19:00 AM
ఆళ్లగడ్డ/నంద్యాల అర్బన్, న్యూస్‌లైన్ : గుంతకల్లు- తిరుపతి మధ్య నడుస్తున్న ఫ్యాసింజర్ రైలును కర్నూలు వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డితెలిపారు. శనివారం అహో బిలం క్షేత్రానికి వచ్చిన మంత్రి కోట్ల స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఈ సం దర్భం గా ఆళ్లగడ్డ, నంద్యాల ఆర్ అం డ్ బీ అతిథి గృహాల్లో విలేకరులతో మాట్లాడారు. సికింద్రాబాద్ నుంచిగుత్తి వరకు డబు ల్ లైన్ నిర్మాణ పనులు చేపడతామన్నారు.గుంతకల్లు - తిరుపతి ఫ్యాసిం జర్‌ను కర్నూలు వరకు పొడిగింపు, డబుల్‌లైన్ నిర్మాణానికి అనుమతులు వచ్చాయన్నారు.
రైల్వేశాఖలో పెండిం గ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే రూ. 40వేల కోట్లు అవసరమవుతాయని, ఇంత మొత్తంలో...
Read more... నిధులు సమకూర్చుకోవడానికిచార్జీలు పెంచ డం మినహా మరో దారి లేదన్నారు. పెంచిన చార్జీలతో ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాతే కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తామన్నా రు. రైల్వే ఆస్తులను ప్రైవే టు సంస్థలకు లీజుకిచ్చే పరిస్థితే లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మంత్రి వెంట డీసీసీ అధ్యక్షుడు రఘురామయ్య, నం ద్యాల నాయకులు మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, కైపరాముడు, ప్రహ్లాదరెడ్డి, వైశ్య ప్రముఖులు లగిశెట్టి సుబ్బగురుమూర్తి, పెసల శ్రీనివాసులు శెట్టి తదితరులు ఉన్నారు.
*****************************************************
click here