Article Source :
గుంటూరు - గుంతకల్లు రైల్వే మార్గం పనులు సకాలంలో పూర్తికాక ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఓ వైపు గడువు ముగిసినా డబ్లింగ్ పూర్తికాకపోవడం.. మరోవైపు తాజాగా పాత ట్రాక్‌ను నవీకరిస్తుండటం వారిని నిరాశకు గురిచేస్తున్నాయి.
నేటికీ...
more... పూర్తవ్వని గుంతకల్లు డబ్లింగ్పలు ఎక్స్‌ప్రెస్‌ల రద్దుతో అవస్థలున్యూస్టుడే, కంభం
పాత ట్రాక్ మధ్య కంకర తొలగిస్తున్న కూలీలు
గుంటూరు - గుంతకల్లు రైల్వే మార్గం పనులు సకాలంలో పూర్తికాక ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఓ వైపు గడువు ముగిసినా డబ్లింగ్ పూర్తికాకపోవడం.. మరోవైపు తాజాగా పాత ట్రాక్‌ను నవీకరిస్తుండటం వారిని నిరాశకు గురిచేస్తున్నాయి. ఇవన్నీ ఎప్పటికి కొలిక్కివస్తాయో..పూర్తిస్థాయిలో రైళ్లు ఎప్పుడు పరుగులు పెడతాయోనని వారు ఎదురుచూస్తున్నారు. పాత ట్రాక్ పనులంటూ పలు ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేయడం ఇక్కడి వారికి శాపంగా మారింది.
గుంటూరు - గుంతకల్లు మార్గంలోని పాత పట్టాల తొలగింపు పనులు కంభం చెరువు ప్రాంతంలో సాగుతున్నాయి. పాత ట్రాక్ సుమారు 30 ఏళ్ల క్రితంది కావడంతో దాన్ని తొలగిస్తున్నారు. దాంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. కంభం - జేబీకే పురం స్టేషన్ల నడుమ యంత్రాలతో పనులు చేస్తున్నారు. ఇది పూర్తయితే మరిన్ని కొత్త రైళ్లు నడిపే అవకాశముంటుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పలు ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గుంటూరు - కాచిగూడ రైలు రద్దు కావడంతో మార్కాపురం, కంభం, గిద్దలూరు, దొనకొండ తదితర ప్రాంతాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. బస్సుల్లో అధిక ఛార్జీలు ఉండడంతో ఇబ్బందికరంగా మారింది. పగటి వేళ గుంటూరు, విజయవాడ వైపు వెళ్లే రైళ్లు లేకపోవడంతో పశ్చిమ ప్రకాశం వాసులు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్, విజయవాడ వైపు వెళ్లే మరికొన్ని ముఖ్యమైన రైళ్లను నడపాలని ప్రజలు కోరుతున్నారు.
సిమెంట్ కమ్మీలతో ట్రాక్ రూపొందిస్తున్న యంత్రం
త్వరలో గిద్దలూరు వరకూ డబ్లింగ్ పూర్తి..!
ఇక గుంటూరు- గుంతకల్లు రైల్వే మార్గంలో రెండో ట్రాక్, విద్యుదీకరణ పనులు కొనసాగుతున్నాయి. వీటికి 2016 -17లో శ్రీకారం చుట్టూరు. మొదట్లో 2021 నాటికి పూర్తి చేస్తామని గతంలో దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు చెప్పినా, ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి ఎప్పటికి అవుతాయోనని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. గతేడాది బడ్జెట్లో రూ.803 కోట్ల నిధులు కేటాయించడంతో పనుల్లో కొంతమేర పురోగతి కనిపిస్తోంది. గుంటూరు నుంచి గుంతకల్లుకు రెండో రైల్వే లైన్ నిర్మించేందుకు సుమారు 405 కిలోమీటర్ల మేర పనులు చేయాల్సి ఉంది. మొత్తం 3,887 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇప్పటి వరకూ 281 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు. త్వరలో జగ్గంబొట్లకృష్ణాపురం - గిద్దలూరు నడమ ఉన్న సుమారు 30 కిలో మీటర్ల మేర డబ్లింగ్ పనులు పూర్తి కానున్నాయి. దీంతో రెండో మార్గం గిద్దలూరు వరకూ అందుబాటులోకి రానుంది. దాంతో ప్రయాణ సమయం తగ్గుతుందని ప్రయాణికులు భావిస్తున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దొనకొండ, మార్కాపురం, తదితర స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు.
#BZA #GTL #GNT #VSKP #SCOR #Southcoastrailway #andhra_railway_infra