తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే ప్రాజెక్టు ప్రణాళిక కీలకదశకు చేరింది. శంషాబాద్-విశాఖపట్నం (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్‌మెంట్ ఖరారైంది.
సూర్యాపేట మీదుగా సెమీ హైస్పీడ్ కారిడార్ గంటకు 220 కి.మీ. వేగంతో ప్రయాణం ఖరారైన కొత్త రైలు మార్గం ఎలైన్‌మెంట్‌ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లువిశాఖ-సూర్యాపేట-కర్నూలు మధ్య మరో కారిడార్‌ఈనాడు - హైదరాబాద్
...
more...
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే ప్రాజెక్టు ప్రణాళిక కీలకదశకు చేరింది. శంషాబాద్-విశాఖపట్నం (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్‌మెంట్ ఖరారైంది. సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ మార్గాన్ని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా విశాఖ నుంచి విజయవాడ, సూర్యాపేటల మీదుగా కర్నూలుకు మరో కారిడార్ నిర్మించనున్నారు. ఇది విశాఖ నుంచి మొదలై.. సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ మీదుగా కర్నూలు చేరుతుంది. వీటి ప్రిలిమినరీ ఇంజినీరింగ్, ట్రాఫిక్ (పెట్) సర్వే తుది దశకు చేరింది. ఈ సర్వే నివేదికను నవంబరులో రైల్వేబోర్డుకు సమర్పించనున్నట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సెమీ హైస్పీడ్ కారిడార్ ఇదే కానుంది. ఈ మార్గంలో శంషాబాద్, రాజమహేంద్రవరం విమానాశ్రయాలను అనుసంధానించేలా ప్రణాళిక రూపొందించడం మరో విశేషం. విమాన ప్రయాణికులు సెమీ హైస్పీడ్ రైళ్లలో స్వస్థలాలకు వేగంగా చేరుకునేలా రైల్వేశాఖ ప్రణాళిక రూపొందించింది. గంటకు 220 కి.మీ. వేగంతో రైళ్లు ప్రయాణించేలా సెమీ హైస్పీడ్ కారిడార్‌ను డిజైన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. హైదరాబాద్ (శంషాబాద్) ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్నానికి నాలుగు గంటల్లోపే చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణానికి 12 గంటల సమయం పడుతోంది. వందేభారత్ 8.30 గంటల్లో చేరుకుంటోంది.
రెట్టింపు వేగం.. తగ్గనున్న సమయం
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ప్రస్తుతం రెండు మార్గాల్లో రైళ్లు ప్రయాణిస్తున్నాయి. మొదటిది వరంగల్, ఖమ్మం, విజయవాడ మార్గం; రెండోది నల్గొండ, గుంటూరు, విజయవాడ ఈ మార్గాల్లో రైళ్ల గరిష్ఠ వేగం గంటకు 110-130 కి.మీ. మాత్రమే. ఈ రెండింటితో పోలిస్తే కొత్తగా రానున్న శంషాబాద్-విశాఖపట్నం మార్గం దగ్గరవుతుంది. వేగం దాదాపు రెట్టింపై.. ప్రయాణ సమయం సగానికంటే తగ్గిపోతుంది.
కర్నూలు మార్గం ఇలా..
విశాఖపట్నం-శంషాబాద్ సెమీ హైస్పీడ్ కారిడార్ ప్రతిపాదిత మార్గంలో మరో కీలకాంశం కూడా ఉంది. విశాఖపట్నం నుంచి కర్నూలు వరకు అనుసంధానం మార్గాన్ని సూర్యాపేట మీదుగా ప్రతిపాదించారు. ఈ మార్గంలో మొత్తం ఎనిమిది రైల్వే స్టేషన్లను ప్రతిపాదించారు.
శంషాబాద్-విశాఖపట్నం సెమీ హైస్పీడ్ కారిడార్‌ని పరిశీలిస్తే.. హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారి మార్గానికి కాస్త అటూఇటూగానే కనిపిస్తోంది. తెలంగాణలో ఇప్పటివరకు రైలు కూత వినిపించని అనేక పట్టణాలు, జిల్లాలు కొత్త కారిడార్‌తో రైల్వే నెట్‌వర్క్‌లో చేరే అవకాశం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ వంటి పట్టణాలకు నేటికీ రైలు మార్గం లేదు. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, వనపర్తి, నాగర్‌కర్నూల్ పట్టణాలకూ రైల్వే మార్గం లేదు. నాగర్‌కర్నూల్ జిల్లా మొత్తంలో ఎక్కడా రైల్వే లైనే లేదు. ఇలాంటి ప్రాంతాల మీదుగా ఇప్పుడు ఏకంగా గంటకు 220 కి.మీ. వేగంతో రైళ్లు దూసుకెళ్లే సెమీహైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.
699 కి.మీ.
వరంగల్, ఖమ్మం మార్గంలో విశాఖపట్నానికి దూరం
663 కి.మీ.
నల్గొండ, గుంటూరు మార్గంలో విశాఖపట్నానికి దూరం
618 కి.మీ.
ప్రతిపాదిత సెమీహైస్పీడ్ కారిడార్‌లో.. సూర్యాపేట మీదుగా దూరం
please wait...Translate to EnglishThe project plan to significantly reduce train travel time between major cities in Telugu states has reached a crucial stage. The alignment for the Shamshabad-Visakhapatnam (Duvvada) semi-high-speed rail corridor has been finalized. The route has been proposed via Suryapet and Vijayawada. As part of this, another corridor will be built from Visakhapatnam to Kurnool via Vijayawada and Suryapet. This will start from Visakhapatnam and go through Suryapet, Nalgonda, Kalwakurthy, and Nagarkurnool to reach Kurnool. The preliminary engineering and traffic (PET) survey is in its final stages. The survey report is expected to be submitted to the Railway Board in November.
This is the first semi-high-speed corridor in Telugu states. Another special feature of this route is the plan to connect Shamshabad and Rajahmundry airports. The Railway Ministry has formulated a plan to enable air passengers to reach their destinations quickly on semi-high-speed trains. The semi-high-speed corridor is being designed for trains to travel at 220 km per hour. Upon completion of this project, one can reach Visakhapatnam from Hyderabad (Shamshabad) airport in just four hours. Currently, the train journey between these two cities takes 12 hours. Vande Bharat reaches in 8.30 hours.
Double the speed, reduced time
Currently, trains travel to Visakhapatnam from Secunderabad via two routes. The first is via Warangal, Khammam, and Vijayawada; the second is via Nalgonda, Guntur, and Vijayawada. The maximum speed of trains on these routes is only 110-130 km per hour. Compared to these two, the new Shamshabad-Visakhapatnam route is shorter. The speed is almost doubled, and the travel time will be reduced by more than half.
Kurnool route is like this
Another key aspect of the proposed route for the Visakhapatnam-Shamshabad semi-high-speed corridor is the connecting route to Kurnool. The route has been proposed via Suryapet. A total of eight railway stations have been proposed on this route.
Looking at the Shamshabad-Visakhapatnam semi-high-speed corridor, it is slightly away from the Hyderabad-Vijayawada NH 65 route. Many towns and districts in Telangana that have not heard the sound of trains until now have the opportunity to join the railway network with the new corridor. There is no railway line in towns like Narketpally, Nakirekal, Suryapet, and Kodad in the erstwhile Nalgonda district. Similarly, there is no railway line in the towns of Kalwakurthy, Wanaparthy, and Nagarkurnool in the erstwhile Mahabubnagar district. There is no railway line anywhere in the entire Nagarkurnool district. Plans are being prepared for the construction of a semi-high-speed corridor through these areas with trains running at 220 km per hour.
699 km
Distance to Visakhapatnam via Warangal, Khammam route
663 km
Distance to Visakhapatnam via Nalgonda, Guntur route
618 km
Distance via Suryapet in the proposed semi-high-speed corridor
please wait...Translate to HindiTelugu raashtralonni pradhaan nagaralal madhya rail praayaan samayaanni gananeeyamgaa tagginche praject pranalika keelakadashaku chereendi. Shamshaabad-Visakhapatnam (Duvvada) madhya semi highspeed rail corridor alignment kharaaraayindi. Suryaapeta, Vijayawada meedugaa ee margaanni pratipadhinchaaru. Indulo bhaagamgaa Visakha nuunchi Vijayawada, Suryaapeta la meedugaa Karnooluku maro corridor nirmanchaanu. Idi Visakha nuunchi modalayee.. Suryaapeta, Nalgonda, Kalvakurthi, Nagar Kurnool meedugaa Kurnool cheruthundi. Veeti preliminary engineering, traffic (PET) survey tudi dashaku chereendi. Ee survey nivaadhikane November lo Railway board ku samarpanchanu aannu samacharaam.
Telugu raashtralonni mottamodaati semi highspeed corridor ide kaanu. Ee margamo Shamshaabad, Rajamahendravaram vimanasrayalanu anusandiginchelaa pranalika roopamandinchadam maro viseesham. Vimaan praayaniikulu semi highspeed railalona swasthalalaku veganga cherukunelaa railway shaakha pranalika roopamandinchi. Ghantaku 220 km vegantou rails praayanichelaa semi highspeed corridor nu design chesthu. Ee project poorthayite.. Hyderabad (Shamshaabad) airport nuunchi Visakhapatnam ki naalu ganthaloope chearukochchu. Prastutham ee rendu nagaralal madhya rail praayaniki 12 ganthala samayama paduthoodi. Vande Bharat 8.30 ganthallo cherukuntoodi.
Rettimbu vegam.. Taggannu samayaam
Sikindraabad nuunchi Visakhapatnam ki prastutham rendu margaloo rails praayanisthunaayi. Modatidi Warangal, Khammam, Vijayawada margham; Rendoodi Nalgonda, Guntur, Vijayawada. Ee margaloo railal garishta vegam ganthaku 110-130 km maatrame. Ee rendintitho polisthee kottaggaa ranu unna Shamshaabad-Visakhapatnam margham daggaravuthundi. Vegam daadhapu rettimbay.. praayaan samayaam saganikanta taggipotundi.
Kurnool margham illaa
Visakhapatnam-Shamshaabad semi highspeed corridor pratipadhitha margamo maro keelaakansham koodaa undhi. Visakhapatnam nuunchi Karnool varaku anusandihanam margamanni Suryaapeta meedugaa pratipadhinchaaru. Ee margamo mottam enmidi railway stations nu pratipadhinchaaru.
Shamshaabad-Visakhapatnam semi highspeed corridor ni parishilisthhee.. Hyderabad-Vijayawada 65va jatiya rahdhari margaanni kaasta atuu itoo gane kanipisthoodi. Telangana lo ippaativaraku rail koota vinipachchi anika pattanalu, jillaalu kotta corridor tho railway network lo cheere avakaasam undhi. Ummadi Nalgonda jillaalo Narkatpalli, Nakirekal, Suryaapeta, Kodada vanti pattanalaku netiki rail margham ledu. Adaividaa ummadi Mahaboobnagar jillaalo unna Kalvakurthi, Vanaparthi, Nagar Kurnool pattanalaku railway margham ledu. Nagar Kurnool jilla mottamlo ekkade railway linen ledu. Ilanti pranthal meedugaa ippadu ekangaa gantaku 220 km vegantou rails doosukellé semi highspeed corridor nirmanaki pranalikalu sidhdham avuthunnaa.
699 km
Warangal, Khammam margamo Visakhapatnam ki dooram
663 km
Nalgonda, Guntur margamo Visakhapatnam ki dooram
618 km
Pratipadhitha semi highspeed corridor lo.. Suryaapeta meedugaa dooram